విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకుడు. రానా దగ్గుబాటి సమర్పణలో స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది. మంగళవారం కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు రవికాంత్, ఆదిత్య, మల్లిక్ రామ్ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ ‘ఇది ఎంతో ప్యాషన్‌తో చాలా డీటెయిల్డ్‌గా బిల్డ్ చేసిన సినిమా. కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాం.
ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూసినవాళ్లు మర్చిపోలేకపోతున్నారు. మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. రొటీన్‌గా కాకుండా.. సినిమా అనే ఫార్మాట్‌కే ఛాలెంజ్ చేసేంత కొత్తగా శశాంక్ ఈ కథను రాశారు’ అని చెప్పాడు. ఇదొక కొత్త తరహా సినిమా అని బిందు మాధవి చెప్పింది. డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో మూడు రోజుల ముందే యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు.
